అక్షరటుడే, హైదరాబాద్: Fastrack UFO | సరికొత్త, డేరింగ్ కలెక్షన్ ‘అన్‌ఐడెంటిఫైడ్ ఫ్యాషన్ ఆబ్జెక్ట్’ ‘Unidentified Fashion Object (UFO) వాచ్‌లను ఫాస్ట్రాక్ Fastrack మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని అచ్చం మరో లోకం నుంచి భువికి దిగొచ్చినట్లుగా తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
అంతరిక్షం space, ఆస్ట్రోనాట్ astronauts, సైన్స్ ఫిక్షన్ science fiction నుంచి ప్రేరణ పొంది.. ఈ కలెక్షన్‌ను ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా రూపొందించినట్లు పేర్కొంటున్నారు. ఇవి కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫాస్ట్రాక్ బ్రాండ్‌కు తగ్గట్టుగానే ‘UFO – ది అన్‌ఐడెంటిఫైడ్ ఫ్యాషన్ ఆబ్జెక్ట్’ను సరికొత్తగా రూపొందించారు. నయాట్రెండర్స్ కు ఆకర్షించడానికి UFO కలెక్షన్‌లోని ప్రతి గడియారాన్ని ఆస్ట్రోనాట్ హెల్మెట్ ఆకారంలో ఉన్న పెట్టెలో పొందుపర్చారు.
ఈ కలెక్షన్ లాంచ్ సందర్భంగా.. 7 నగరాలలోని పెద్ద ఔట్డోర్ (OOH) ఇన్స్టాలేషన్లను ఫాస్ట్రాక్ ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భారీ 3 డీ యూఎఫ్‌వోల నిర్మాణాలతో, లైట్ ఎఫెక్ట్స్ తో, అంతరిక్షానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించింది.
Fastrack UFO | క్రియేటర్లతో ఫాస్ట్రాక్ భాగస్వామ్యం
డిజైన్‌లో సరికొత్త పోకడలను సృష్టించే ఫ్యాషన్ క్రియేటర్లతో ఫాస్ట్రాక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీరు యూఎఫ్‌వో కలెక్షన్ వాచులతో అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌ను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఫాస్ట్రాక్ వాచెస్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ డ్యానీ జాకబ్(Danny Jacob) మాట్లాడుతూ.. “యూఎఫ్‌వో కలెక్షన్‌తో, అంతరిక్షం థ్రిల్‌ను నేరుగా మీ చేతి మణికట్టు పైకి తీసుకురావాలనుకున్నాం. ప్రతి వాచ్‌లో ఆస్ట్రోనాట్ల అంశాలు, సై-ఫై డిటైల్స్ ఉంటాయి. తద్వారా యువత తమ స్టైల్‌ను ధైర్యంగా వ్యక్తం చేస్తారు. అలా ఫాస్ట్రాక్.. స్టైల్‌ను మరో స్థాయికి తీసుకువెళ్తుంది” అని పేర్కొన్నారు.
ఈ యూఎఫ్‌వో కలెక్షన్ ధరలు రూ. 5,995 నుంచి రూ. 6,895 వరకు ఉన్నాయి. ఇవి ఫాస్ట్రాక్ స్టోర్స్, టైటాన్ వరల్డ్, డీలర్ల వద్ద, www.fastrack.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.