1 million likes
RCB | అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా ఆర్సీబీ పోస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్: RCB | అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకొని తొలిసారి ఐపీఎల్ సిరీస్ ద‌క్కించుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి.. 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది ఆర్సీబీ. 191 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. కాస్త తడబడింది. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేక.. ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. చివర్లో మెరుపులు మెరిపించినా.. ఫలితం లేకపోయింది.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జస్ట్ ఒక్క బంతితో మిస్ అయిందని చెప్పొచ్చు.

RCB | అరుదైన రికార్డ్..

చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు కావాల్సి ఉండగా.. పంజాబ్ Punjab బ్యాటర్ 36 పరుగులు చేశాడు. అలాగే ఆఖరి ఓవర్‌కు 29 పరుగులు కావాల్సి ఉండగా.. మొదటి రెండు డాట్ బాల్స్ మినహా.. మిగిలిన నాలుగు బంతులను బౌండరీలు దాటించేశాడు. దాదాపు చివ‌రి వ‌ర‌కు వ‌చ్చి పంజాబ్ ఓడింది. ఇక ఆర్సీబీ గెలుపుతో విరాట్ కోహ్లీ(Virat Kohli) క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నా. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను 6 వికెట్లతో ఓడించి తమ తొలి టైటిల్‌ను గెలిచింది. ఈ విజయాన్ని జరుపుకుంటూ, RCB వారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో కేవలం 5 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్‌(1 Million Likes)ను సాధించి. భారతదేశంలో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా రికార్డు(Record) సృష్టించింది.

ఆ త‌ర్వాత ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ FIFA World Cup విన్ సాధించిన‌ప్పుడు కూడా ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ పోస్ట్ కూడా 5 నిమిషాల‌లో 1 మిలియ‌న్ లైక్స్ సాధించింది. గ‌తంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పోస్ట్ 10 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సాధించి, అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ పొందిన భారతీయ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా నిలిచింది. కానీ, ఇప్పుడు RCB జట్టు వారి టైటిల్ విజయం తర్వాత ఈ రికార్డుల‌ను అధిగమించింది.