ePaper
More
    HomeజాతీయంRailway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు పోనున్నాయి. ఉత్తరాదితో తెలంగాణను కలిపే కాజీపేట–బల్లార్షా (Kazipet–Ballarshah) మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్ (Railway Line)​ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో లైన్​ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. త్వరలో పనులు పూర్తి చేసి నాలుగో లైన్​ నిర్మాణం చేపట్టనున్నారు. కాజీపేట నుంచి బల్లార్షా వరకు 234 కిలోమీటర్ల మేర నాలుగో లైన్​ నిర్మించనున్నారు. దీనికి వచ్చే బడ్జెట్​లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. జులై 19న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)​ రాష్ట్రంలో పర్యటించారు. నాలుగో లైన్​ నిర్మాణం చేపడుతామని ఆ సమయంలో ఆయన తెలిపారు.

    READ ALSO  KTR | స్థానిక ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటన

    Railway Line | నిత్యం రైళ్ల రద్దీ

    ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాదిని అనుసంధానించే కాజీపేట–బల్లార్షా మార్గంలో నిత్యం వందల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రైళ్ల (Trains) రద్దీని దృష్టిలో పెట్టుకొని మూడో లైన్​ నిర్మాణం చేపట్టారు. రైళ్లు అధికంగా తిరుగుతుండడంతో క్రాసింగ్​ సమయంలో ప్రస్తుతం చాలా సమయం స్టేషన్లలో నిలిపి ఉంచాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగో లైన్లు అందుబాటులోకి వస్తే క్రాసింగ్​ల బాధ తప్పి.. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నాలుగు లైను నిర్మిస్తే గూడ్స్​ కోసం సెపరేట్​ ట్రాక్​ వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Railway Line | సర్వే పూర్తి

    నాలుగు లైన్​కు సంబంధించి అధికారులు సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం 205 కిలోమీటర్ల మేర మూడో లైన్​ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో 177 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మహారాష్ట్ర పరిధిలో 46 కి.మీ. మేర పనులు పూర్తికాగా తెలంగాణలోని ఆసిఫాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రేచినిరోడ్‌-బెల్లంపల్లి-మందమర్రి మధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగో లైన్​ను రూ.3 వేల కోట్లతో 234 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఇందులో తెలంగాణలో 80 శాతం, మహారాష్ట్రలో 20 శాతం ఉంది. ప్రస్తుతం సర్వే పూర్తి కావడంతో అధికారులు డీపీఆర్​ రూపొందిస్తున్నారు.

    READ ALSO  Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...