HomeతెలంగాణSuryapeta | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ పెడతామని వచ్చి.. బంగారం దుకాణంలో చోరీ

Suryapeta | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ పెడతామని వచ్చి.. బంగారం దుకాణంలో చోరీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Suryapeta | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నగల దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సూర్యాపేట(Suryapeta) పట్టణంలో సాయి సంతోషి జ్యువెల్లరీ షాప్​(Sai Santoshi Jewellery Shop)లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు గ్యాస్​ కట్టర్​ సాయంతో షట్టర్​ ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. దుకాణంలోని 18 కిలోల బంగారం రూ.17.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Suryapeta | యూపీకి చెందిన ముఠా

నగల దుకాణంలో చోరీ చేసింది యూపీకి చెందిన ముఠా(UP Gang)గా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం ఐదుగురు ముఠా సభ్యులు పట్టణంలోని ఓ బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఫాస్​ ఫుడ్​ సెంటర్(Fast Food Center)​ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు పాడుపడ్డ ఇంట్లో రెండు రూములను రెంట్​కు తీసుకున్నారు. ఈ క్రమంలో రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్​తో చోరీకి పాల్పడ్డారు. అనంతరం పారిపోయారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Must Read
Related News