HomeజాతీయంEngagement Ring | మ్యాగీ కోసం బంగారు ఉంగరం అమ్మేందుకు వెళ్లిన‌ 13 ఏళ్ల బాలుడు.....

Engagement Ring | మ్యాగీ కోసం బంగారు ఉంగరం అమ్మేందుకు వెళ్లిన‌ 13 ఏళ్ల బాలుడు.. కాన్పూర్‌లో వింత ఘటన

కాన్పూర్‌లో 13 ఏళ్ల బాలుడు మ్యాగీ నూడుల్స్ కొనేందుకు తన అక్క నిశ్చితార్థానికి సంబంధించిన బంగారు ఉంగరాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన ఘటన ఆశ్చర్యం కలిగించింది. అయితే, జ్యూవెల్లరీ షాప్ యజమాని నిజాయితీగా స్పందించడంతో ఉంగరం తిరిగి కుటుంబానికి చేరింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Engagement Ring | కాన్పూర్‌ (Kanpur) శాస్త్రినగర్‌లో ఓ ఘటన స్థానికులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాగీ నూడుల్స్ (Maggi noodles) తినాలన్న కోరికతో ఒక 13 ఏళ్ల బాలుడు, తన సోదరి నిశ్చితార్థానికి సంబంధించిన బంగారు ఉంగరాన్ని (sister engagement ring) అమ్మేందుకు నగల దుకాణానికి వెళ్లాడు. ఈ సంఘటన పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్​కు ఎలా అలవాటు పడుతున్నారో తెలియజేస్తోంది.

Engagement Ring | ఉంగరంతో దుకాణానికి వెళ్లిన‌ బాలుడు

శాస్త్రినగర్‌లో ఉన్న పుష్పేంద్ర జైస్వాల్ (Pushpendra Jaiswal) జువెల్లర్స్ దుకాణానికి వెళ్లిన బాలుడు, తన వద్ద ఉన్న బంగారు ఉంగరాన్ని అమ్మాలనుకుంటున్నాడని చెప్పాడు. బాలుడి అమాయకత్వాన్ని గమనించిన జైస్వాల్, అతడిని ప్రశ్నించారు.

దానికి బాలుడు “మ్యాగీ (Maagi) తినాలని ఉంది, డబ్బులేదు, అందుకే అమ్మాలని వచ్చాను” అంటూ సమాధానం ఇచ్చాడు. విషయం ఏదో విచిత్రంగా ఉందని గ్రహించిన వ్యాపారి, ఆ బాలుడిని అడిగి తల్లి ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెను సంప్రదించాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన తల్లి, ఆ ఉంగరం తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించినదని గుర్తించింది. త్వరలోనే ఆమె కూతురి పెళ్లి ఉందని తెలిపింది.

బాలుడి అమాయకతను పుష్పేంద్ర జైస్వాల్ గమనించి ఉంగరాన్ని కొనకుండా, తల్లికి తిరిగి ఇచ్చేశారు. పైగా, “మన మార్కెట్లో ఎవరూ సరైన ధృవీకరణ లేకుండా మైనర్ల నుంచి వస్తువులు కొనరు” అని చెప్పారు. తన కొడుకు చేసిన పనికి తల్లి షాక్ అయింది. కానీ వ్యాపారి నైతిక స్థాయి గౌరవించి ఉంగరం తిరిగి ఇవ్వడంతో ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ త‌ర్వాత ఆ తల్లి కొడుతో కలిసి దుకాణం Shop నుంచి ఇంటికి వెళ్లారు. ఈ సంఘటన పిల్లలు ఫాస్ట్ ఫుడ్‌ల (Fast Food) పట్ల ఎంతగా ఆకర్షితులవుతున్నారనే తెలియజేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల దైనందిన చర్యలపై ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన చెబుతోంది. తల్లిదండ్రులకు తెలియ‌కుండా పిల్లలు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఉదంతం గుర్తు చేస్తోంది.