అక్షరటుడే, కోటగిరి: Heavy rains | భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాల్లో పంటపొలాలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోటగిరి మండలంలో వరి, సోయా (Soya), కూరగాయల పంటలు (Vegetable crops) నీళ్లలోనే ఉన్నాయి. చాలా చోట్ల మొక్కజొన్న (Corn) నేలమట్టమైంది. కూరగాయల పంటలు కూడా నీళ్లలో ఉండి కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద కారణంగా పొలాలు చెరువుల్లా తలపిస్తున్నాయని వాపోయారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పొలాలను సందర్శించి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Heavy rains | దెబ్బతిన్న పంటల పరిశీలన
అక్షరటుడే, నిజాంసాగర్: రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు పొలాల్లో వరదనీరు చేరింది. పిట్లం (pitlam) మండలంలోని చిన్నకొడప్గల్ (chinnakodapgal) గ్రామ శివారులోని ఎల్లయ్య చెరువు ఆయకట్టు పూర్తిగా నీటమునిగింది. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. దీంతో బుధవారం వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారి సురేష్ ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ముంపునకు గురైన పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి సురేష్ తదితరులు