Homeజిల్లాలునిజామాబాద్​Former MLA Shakeel | పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే షకీల్​

Former MLA Shakeel | పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే షకీల్​

ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్​ నియోజకవర్గ ప్రజలు నష్టపోయారని.. అయినా ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదని బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. కాంగ్రెస్​ బాకీ కార్డు పోస్టర్లను బోధన్​లో శనివారం విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే,బోధన్: Former MLA Shakeel | ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్​ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్ నియోజకవర్గ (Bodhan Constituency) రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సైతం పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

Former MLA Shakeel | 22 నెలలు గడుస్తున్నప్పటికీ..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని షకీల్ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని కాంగ్రెస్ బాకీ కార్డులను ఆయన విడుదల చేశారు.

అధికారం చేపట్టిన 22 నెలలుగా బోధన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులు జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కనీసం వారానికి ఒక్కరోజైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని షకీల్ సూచించారు. సమావేశంలో బీఆర్​ఎస్​ నాయకులు పేర్కొన్నారు.