అక్షర టుడే, వెబ్డెస్క్: Yellareddy | జిల్లాలో ఇటీవల భారీ వర్షాలతో (Heavy Rain) పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో పార్థసింహారెడ్డిని (RDO Parthasimha Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాలకు జిల్లాలో పంట నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. నెలరోజులైనా ప్రభుత్వం ఆదుకోలేదని, తమ చారిటబుల్ ట్రస్ట్ (charitable trust) ఆధ్వర్యంలో 100 మందికి పైగా పేదలకు నిత్యవసర సరుకులు అందించామన్నారు. కానీ పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనన్నారు. గత వారం సీఎం రేవంత్ రెడ్డి నియోజవర్గంలో పర్యటించి, రైతులకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట నష్టపోయిన రైతులు దసరా పండుగ (Dussehra Festival) సంతోషంగా చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించి, ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు రాజేష్, నర్సింలు, క్రాంతి, శ్రీనివాస్, బాలకిషన్, దత్తురాం, రైతు నాయకులు రాజు దాస్, కిష్టయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.