Homeజిల్లాలునిజామాబాద్​Armoor | పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

Armoor | పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుకూలి సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​కు వినితపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | మొంథా తుపాన్​ (Cyclone Montha) వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతుకూలీ సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియాకు (Sub-Collector Abhigyan Malviya) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే.. రైతుల గోస పాలకులకు పట్టడం లేదన్నారు. ఆర్మూర్ (Armoor) డివిజన్​లో సుమారు 50వేల ఎకరాలకు పైగా పంటలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే బీమా సౌకర్యం కూడా లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన వివరాలను సేకరించాలన్నారు. రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఆపదలో రైతులను ఆదుకోవాలన్నారు. ఐకేపీ కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన్న, సాయిలు, కుల్దీప్ శర్మ, జన్నపల్లి నడిపి రాజన్న, భామండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News