Homeజిల్లాలుకామారెడ్డిkamareddy | వాగులో చిక్కుకున్న రైతులు.. వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఘటన..

kamareddy | వాగులో చిక్కుకున్న రైతులు.. వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఘటన..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : kamareddy : కామారెడ్డి జిల్లాలో రైతులు Farmers, వ్యవసాయ కార్మికులు agricultural workers వాగులో చిక్కుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల వల్ల వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించడంతో ఐదుగురు అందులో చిక్కుకుపోయారు.

శనివారం (జులై 19) రాత్రి సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చీకట్లోనే ట్రాక్టర్​ సాయంతో వారిని బయటకు సురక్షితంగా తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.