అక్షరటుడే, కోటగిరి: Kotagiri | ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని (soybean purchase center) రైతులు వినియోగించుకోవాలని ఉమ్మడి మండలాల తహశీల్దార్ గంగాధర్ కోరారు.
పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలోని పోతంగల్ విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. పోతంగల్ సొసైటీ పరిధిలోని సుంకిని, కొల్లూర్, హెగ్డేలి, సోంపూర్, టాక్లి, దోమలేడ్గి, గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,328 మద్దతు ధర ఇస్తోందని వివరించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, సంఘం అడ్మినిస్ట్రేటర్ మహమ్మద్ రియాజుద్దీన్, సొసైటీ సెక్రెటరీ శివాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, హంగర్గ గంగాధర్, దిలీప్ కుమార్, హన్మంత్ రావు పటేల్, లక్ష్మణ్, నాగరాజు, రాజేందర్, నాగ్నాథ్, రాజు, హన్మంత్ రావు, సాయిలు, మాధవరావు, మల్లుగొండ, కైలాస్ తదితరులు పాల్గొన్నారు.

