Awareness Seminar | రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలి
Awareness Seminar | రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలి

అక్షరటుడే, కోటగిరి:Awareness Seminar | రైతులు తమ పొలాల్లో యూరియా(Urea) వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపాలని శాస్త్రవేత్త కృష్ణ చైతన్య(Scientist Krishna Chaitanya) సూచించారు. పోతంగల్​ మండల కేంద్రంలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు(Farmers) సాగుపై అవగాహన కల్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులను మారుస్తూ పంటలకు పిచికారీ చేయాలని సూచించారు.

పంటలకు అకాల వర్షాలు ఇతరత్రా ముప్పు వాటిల్లినప్పుడు ఉపయోగపడే విధంగా పంటలకు సంబంధించి పురుగుల మందులు(Pesticides), ఎరువుల రసీదులను(Fertilizer Receipt) భద్రపర్చుకోవాలని పేర్కొన్నారు. కొత్త కొత్త పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్​ హన్మంత్, ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్, ఏవో నిషిత, ఏఈవో సుప్రియ, రైతులు తదితరులు పాల్గొన్నారు.