అక్షరటుడే, నిజాంసాగర్: Paddy Purchasing Centers | రైతులపై అధికారుల నిర్లక్ష్యం తగదని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్(Mohammed Nagar) మండలంలోని నర్వ గ్రామంలో పర్యటించి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని రైసుమిల్లులకు(Rice mills) తరలించేలా చూడాలని సొసైటీ సీఈవో రాములు, డిప్యూటీ తహశీల్దార్‌కు సూచించారు. ఆయన వెంట నాయకులు హైమారెడ్డి, రాములు, రాజు తదితరులున్నారు.
