అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Collector | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. రామారెడ్డి మండలం (Ramareddy mandal) మొండి వీరన్న తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తేమ శాతాన్ని ప్రభుత్వ సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా చూడాలన్నారు.
తూకం, నాణ్యత పరీక్షల్లో (quality test) పూర్తి పారదర్శకత పాటించాలని కేంద్రి సిబ్బందికి సూచించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో (purchase centers) బరువులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, తహశీల్దార్ ఉమలత, రైతులు, తదితరులున్నారు.