అక్షరటుడే, ఆర్మూర్: Armoor | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై (Nizamsagar Canal) అన్నదాతలు గురువారం రాస్తారోకో చేశారు. మెప్మా సెంటర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని వారు పేర్కొన్నారు.
రైతులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న కిసాన్ మోర్చా రాష్ట్ర (State Kisan Morcha) నాయకుడు నూతల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నా ఇప్పటివరకు అధికారులు పరిశీలనకు రాలేదన్నారు. అనంతరం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి (ACP Venkateswar Reddy of Armor) ఆర్డీవో రాజాగౌడ్‌తో (RDO Rajagoud) మాట్లాడి రెండు రోజుల్లో తూకాలు వేసి ధాన్యం మొత్తాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.