ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు ఊపందుకుకున్నాయి. ఈ క్రమంలో రైతులు యూరియా (Urea), ఇతర ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పలు చోట్ల యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

    బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ (Mupkal) మండలం రెంజర్ల గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు, మహిళలు భారీగా వచ్చారు. అయితే క్యూలైన్​లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈ విషయంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prahsnth Reddy) ఎక్స్​ వేదికగా స్పందించారు. రేవంత్​రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

    రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రైతులకు గత కాంగ్రెస్ పాలనలోని పాత రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కోసం రైతులు ఏనాడు ఇబ్బందులు పడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...