Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతలు ఆగమవుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనేవారు లేక నిరసనలకు దిగుతున్నారు. బుధవారం పోతంగల్‌ మండలంలో pothangal mandal రైతులు farmers ఆందోళనకు దిగారు. స్థానిక చెక్‌ పోస్ట్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంటలు పూర్తయిన ధాన్యం సంచులను వెంటనే మిల్లులకు తరలించాలని, లోకల్‌ రైస్‌ మిల్లులకే local rice mill అలాట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో మండలానికి వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రైతుల Mla Pocharam Srinivas Reddy వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడి.. బుధవారం సాయంత్రంలోగా సమస్యలన్ని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.

Must Read
Related News