అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రైతుల నుంచి కోళ్లు తెచ్చుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ పౌల్ట్రీ సప్లయర్ ఇంటి వద్ద బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం (Ramareddy Mandal) అన్నారం గ్రామానికి చెందిన సల్మాన్ సిద్దిపేట జిల్లా (Siddipet District) భూంపల్లికి చెందిన సాజిద్ నుంచి కోళ్లు తెచ్చుకుని ఆ కోళ్లను కంపెనీలకు తరలిస్తుంటాడు.
సాజిద్, సల్మాన్ ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తుండేవారు. అయితే సాజిద్ రైతుల నుంచి కోళ్లు తీసుకుని సల్మాన్‌కు విక్రయిస్తుంటాడు. కంపెనీ నుంచి సల్మాన్, సల్మాన్ నుంచి సాజిద్, సాజిద్ నుంచి రైతులకు డబ్బులు చేరేవి. అయితే కొద్దిరోజులుగా కంపెనీ నుంచి వచ్చిన డబ్బులను తీసుకుంటున్న సల్మాన్ సాజిద్‌కు ఇవ్వడం లేదు. దీంతో సాజిద్‌కు కోళ్లు ఇచ్చిన రైతులు డబ్బుల కోసం ఇంటికి రావడం మొదలుపెట్టారు.
దాంతో ఇటీవల డబ్బులు ఇవ్వాలని సల్మాన్ దగ్గరికి సాజిద్ రాగా డబ్బులు ఇచ్చేది లేదు ఏమి లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అని అతడిని కారుతో ఢీకొనగా గాయలైనట్లు సాజిద్ తెలిపాడు. 15 రోజుల నుంచి తాను కామారెడ్డిలోనే ఉంటున్నానని, రైతుల ఇబ్బందులు పెడుతుంటే నేరుగా అన్నారం గ్రామంలోని (Annaram village) సల్మాన్ ఇంటికి రైతులను తీసుకుని వచ్చినట్టు వెల్లడించారు. తాను ఒక్కడినే వస్తే తనను ఏదైనా చేస్తాడేమోనన్న భయంతో రైతులను తీసుకుని వచ్చానన్నారు. భూంపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులకు 34 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని సాజిద్ తెలిపాడు.