అక్షరటుడే, కామారెడ్డి: Veterinary hospital | ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని పాడి రైతులు (Farmers) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాల (veterinary hospital) ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. వెంటనే పశువైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో లేక ప్రైవేట్ వైద్యులను (private doctors) సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఉచితంగా పంపిణీ చేయాల్సిన మందులను ఆస్పత్రి సిబ్బంది పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.