అక్షరటుడే, కామారెడ్డి: Farmers | జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్కను (Minister Seethakka) రైతులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. భిక్కనూరు మండలంలో (Bhikkanoor mandal) పర్యటన పూర్తి చేసుకుని సిరికొండ వెళ్తున్న మంత్రి సీతక్కను రామారెడ్డి వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇచ్చిన హామీ మేరకు సన్నాలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క రైతులపై (Farmers) అసహనం వ్యక్తం చేశారు. మీరు రైతులేనా.. ఏదైనా అడగాలంటే టైం తీసుకుని రావాలి.. నేను వేరే ఊరు వెళ్తున్న అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు అడగడానికి వస్తే ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
