అక్షరటుడే,లింగంపేట: Farmer ID card | మండలంలోని రైతులు రైతు గుర్తింపు కార్డుల (farmer identity cards) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో సంతోష్ అన్నారు. లింగంపేట మండలంలోని మలోత్ తండాలో శనివారం రైతు గుర్తింపు కార్డుల ప్రక్రియ నిర్వహించారు.
Farmer ID card | ప్రతిరైతుకు కార్డు ఉండాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాపాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందాలంటే రైతు గుర్తింపు కార్డు ప్రామాణికంగా కానుందని వివరించారు. రైతులు తప్పనిసరిగా ఈ కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మీసేవ కేంద్రాల్లో..
ఆయా ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాలు, రైతువేదిక కార్యాలయంలో గాని సంప్రదించి గుర్తింపు కార్డుకు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాల గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, రైతులు రామ్చంద్, మోహన్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.