అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | బాన్సువాడ మండలం చింతల నాగారం రైతులు బుధవారం ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైప్‌లైన్ (lift irrigation pipeline) పాడైపోవడంతో గత వర్షాకాలంలో పంటలకు నీరు అందని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పైప్‌లైన్ మరమ్మతులకు రూ. 6 లక్షలు, సిల్ట్ తొలగింపుకు రూ.1.50 లక్షలు నిధులు మంజూరు చేశారు.
Mla Pocharam | ట్రయల్‌రన్ విజయవంతం..
మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తవ్వడంతో పాటు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం చింతల నాగారం శివారు రైతులు సొసైటీ ఛైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చింతల నాగారం శివారు రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.