48
అక్షరటుడే, ఇందూరు: Sri Chaitanya School | జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి శ్రీచైతన్య పాఠశాలలో (Sri Chaitanya School) శనివారం ముందస్తుగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీప్రైమరీ బాలబాలికలు (Pre-primary students) ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Sri Chaitanya School | రైతు వేషధారణలో అలరించిన చిన్నారులు
కార్యక్రమంలో భాగంగా చిన్నారులు రైతుల వేషధారణలో అలరించారు. పంటపొలాల్లో రైతులు చేసే పనులను చిన్నారులు చేస్తూ అబ్బురపర్చారు. బాలబాలికలు పలుగు, పార, వరిపైర్లు పట్టుకుని అచ్చం రైతులు చేసే పనులు చేస్తూ ఔరా అనిపించారు. కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం మహిపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ స్వప్న, ప్రీప్రైమరీ కోఆర్డినేటర్ సౌజన్య, ఇన్‌ఛార్జి లావణ్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.