అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను (Power substation) ముట్టడించారు.
వివరాల్లోకి వెళ్తే.. బాల్కొండ (balkonda) మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక రైతులు ముట్టడించారు. కొన్ని రోజులుగా విధిస్తున్న కోతల వల్ల తమ పంట పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి పంట పొలాల్లోని బోరు బావులకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని సూచించారు.
ఉపకేంద్రం వద్ద అందుబాటులో ఉన్న ఏఈ మహేష్ మాట్లాడుతూ.. పంట పొలాలకు త్రీఫేస్ కరెంటు నిరంతరం సరఫరా అయ్యే విధంగా చూస్తామని రైతులను సముదాయించారు. సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన వారిలో రైతులు పెంటు రాజేశ్వర్, అంబటి సాయన్న, గోపు చిన్నయ్య, బుర్ర రాజేశ్వర్, ఇదాన్ రావు, ఎద్దండి నరసయ్య తదితరులున్నారు.