అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. శుక్రవారం ఇందల్వాయి రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ రికార్డుల్లో తప్పులుంటే పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) భూభారతి చట్టం తెచ్చిందన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహశీల్దార్ వెంకటరావు, ఎంపీడీవో అనంతరావు, సొసైటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
