- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిFarmers | జీలుగ విత్తనాల కొరత.. రైతుల ఆగ్రహం

Farmers | జీలుగ విత్తనాల కొరత.. రైతుల ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Farmers | జీలుగ విత్తనాల కొరతపై రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా విత్తనాలు పంపిణీ చేయకపోవడంపై ఆందోళన చేపట్టారు.

గురువారం కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి రైతు వేదికలో (Isrojiwadi Rythu Vedika) రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బస్తాల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చేపట్టారు. గతం కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నా సరిపడా బస్తాలు లేకపోవడంపై అధికారులను నిలదీశారు. వెంటనే సరిపడా విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News