4
అక్షరటుడే, ఆర్మూర్: Nandipet | విత్తనాల కంపెనీ మోసం చేసిందని పేర్కొంటూ రైతులు రోడ్డెక్కారు. అంకాపూర్ (Ankapur) గ్రామంలోని జాతీయ రహదారిపై నందిపేట్‌లోని (nandipet) సీహెచ్ కొండూరు (CH Kondur) రైతులు అంకాపూర్ జాతీయ రహదారిపై సోమవారం భైఠాయించారు. ఈ సందర్భంగా రైతు బొజ్జ నాగేష్ మాట్లాడుతూ.. అంకాపూర్ గ్రామానికి చెందిన సిస్ కంపెనీ యజమాని వద్ద పది బస్తాల మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామన్నారు. ఐదెకరాల్లో సాగు చేయగా విత్తనాలు మొలకెత్తలేదన్నారు. దీంతో సీహెచ్ కొండూరు ఎక్స్ సర్పంచ్ దమ్మన్న గారి ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశామని చెప్పారు.