Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | గడ్డి కోస్తుండగా తెగిన విద్యుత్​ వైర్లు.. కరెంట్​ షాక్​తో రైతు మృతి

Bheemgal | గడ్డి కోస్తుండగా తెగిన విద్యుత్​ వైర్లు.. కరెంట్​ షాక్​తో రైతు మృతి

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | పొలంలో గడ్డి కోస్తుండగా (Grass) విద్యుత్​ తీగలు తెగి కరెంట్​ షాక్​తో రైతు మృతి చెందిన ఘటన భీమ్​గల్​ మండలంలో చోటు చేసుకుంది. భీమ్​గల్​ ఎస్సై సందీప్​ (Sub Inspector Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. ​మండలంలోని రహత్ నగర్ (Rahath Nagar) గ్రామానికి చెందిన రైతు ధరావత్ రామ్ సింగ్(50) రోజూ మాదిరిగానే శుక్రవారం తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లాడు.

కాగా.. పొలంలో ఒడ్డు వెంట గడ్డి కోసే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్​ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పక్కనే పొలం దున్నుతున్న మరో రైతు గమనించి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి (Armoor Government Hospital) తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Must Read
Related News