అక్షరటుడే, గాంధారి: Gandhari | గడ్డిమందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గాంధారి (gandhari) మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని సీతాయి పల్లి (Seetai Pally) గ్రామానికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య గ్రామశివారులో మొక్కజొన్న వరిసాగు చేస్తున్నాడు. అయితే ఆయన పోడుభూమిలో సాగు చేస్తున్నాడని ఆరోపిస్తూ అటవీశాఖాధికారులు బుధవారం వరిపంటపై గడ్డిమందు స్ప్రే (Herbicide spray) చేయించారు. అనంతరం చిన్నమల్లయ్యపై అటవీశాఖాధికారులు (Forest Department) స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లారు. అలాగే చిన్నమల్లయ్య సైతం అటవీ అధికారులపై ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్కు వెళ్లాడు.
కాగా.. పోలీస్స్టేషన్ (police station) బయట చిన్నమల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయన కుటుంబీకులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమారుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.