Homeజిల్లాలుకామారెడ్డిBar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

Bar Association Kamareddy | బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి వీడ్కోలు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:Bar Association Kamareddy | కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తలను(Judges) బార్​ అసోసియేషన్(Bar Association)​ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న లాల్​సింగ్ శ్రీనివాస్ బదిలీపై మంచిర్యాలకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్, డీఎల్ఎస్ఏ ఛైర్మన్ నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళి, జాయింట్ సెక్రటరీ మోహన్, కోశాధికారి వేణుప్రసాద్, లైబ్రరీ సెక్రటరీ రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్​ మెంబర్లు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.