అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hari Hara Veeramallu | దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు చిత్రం థియేటర్స్‌లోకి వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బుధవారం రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలు వేశారు. ఇక థియేటర్స్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. టిక్కెట్ల రేట్లు భారీగా ఉన్నా కూడా అభిమానులు ఎగబడి చూసారు. ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాటల్లో హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) హైపే వేరు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ..సినిమా అద్భుతంగా ఉంది, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి అంటూ అభిమానం చాటుకుంటున్నారు.
Hari Hara Veeramallu | నెగెటివ్ టాక్..
హీరోయిన్ నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal) గ్లామర్, ఎంఎం కీరవాణి సంగీతం(MM Keeravani Music) సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెబుతున్నారు. అయితే మరోవైపు నెగిటివ్ టాక్ అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు క్రిష్(Director Krish) టచ్ కనిపించింది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం నిరాశపరిచిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీఎఫ్ఎక్స్ పరంగా సినిమా బలహీనంగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా పేలవంగా ఉంది, టేకింగ్ కూడా వరస్ట్‌గా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు మధ్యలోనే బయటికి వచ్చారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది.
పవన్ అభిమానులు #BlockbusterHariHaraVeeraMallu అంటూ ట్రెండ్ చేస్తుండగా, వ్యతిరేకులు, రాజకీయ ప్రత్యర్ధులు #DisasterHariHaraVeeraMallu ట్యాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. చిత్రంలో సినిమా టేకింగ్, కొన్ని సీన్స్ , దర్శకుని పని తీరు, వీఎఫ్ఎక్స్ మీదే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చర్చనీయాంశం అయింది. ఈ సినిమాకి ఓటీటీ స్ట్రీమింగ్ డీల్ కూడా లాక్ అయినట్టు సమాచారం. సినిమా థియేటర్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మొత్తానికి ‘హరిహర వీరమల్లు’కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఫ్యాన్స్‌కు ప్రత్యేక అనుభూతినిచ్చినా, కథా నిర్మాణం, టెక్నికల్ అంశాలు మాత్రం నిరాశే మిగిలించాయి.