అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thalapathy Vijay | తమిళ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత దళపతి విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మలేషియా (Malaysia) నుంచి చెన్నై వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టారు.
విజయ్ డిసెంబర్ 27న మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో (Bukit Jalil Stadium) జరిగిన ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి తిరిగి చెన్నై చేరుకున్నారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చెన్నై విమానాశ్రయానికి (Chennai Airport) వచ్చారు. ఆయన ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే ఫ్యాన్స్ చుట్టు ముట్టారు. దీంతో ఆయన ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడింది. బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్‌ను పక్కకు నెట్టివేస్తూ.. ఆయనను కారు వద్దకు తీసుకొచ్చారు. అయితే అభిమానులు అతడిని కలవడానికి దూసుకు రావడంతో విజయ్ కారు ఎక్కే ప్రయత్నంలో తడబడి కిందపడ్డారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కారులో ఎక్కించారు.
Thalapathy Vijay | వీడియో వైరల్
భారీ జనసమూహం మధ్య నడుచుకుంటూ వెళ్తున్న విజయ్, ఎగ్జిట్ వైపు వెళ్తున్నప్పుడు తడబడిన దృశ్యం కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో సైతం హీరోయిన్ నిధి అగర్వాల్, సమంతను అభిమానులు చుట్టు ముట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా తమిళ హీరోకు సైతం అదే పరిస్థితి ఏర్పడింది. అభిమాన నాయకులు, నటుల ప్రైవసీ గురించి పట్టించుకోకుండా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ (Jana Nayagan Audio Launch) కార్యక్రమానికి దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యారు. ఈ భారీ జనసమూహం కారణంగా ఇది మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. శ్రీలంక తర్వాత తమిళులు మలేషియాలో ఎక్కువగా నివసిస్తారు. కాగా.. ఈ కార్యక్రమానికి పూజా హెగ్డే, ప్రియమణి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, గేయ రచయిత వివేక్, షోబి మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్‌తో సహా పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ మూవీ జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Another lapse in common sense.
Fans rushed to greet #ThalapathyVijay on his return to Chennai from Malaysia, causing a crowd surge.
Visuals show Vijay losing balance and falling amid the chaos.pic.twitter.com/5dK1EPFwNh
— Gulte (@GulteOfficial) December 28, 2025