HomeUncategorizedFake Video | ఎంత ప‌ని చేశారురా అబ్బాయిలు.. ఫేక్ వీడియోకి బన్నీ కూడా బుట్ట‌లో...

Fake Video | ఎంత ప‌ని చేశారురా అబ్బాయిలు.. ఫేక్ వీడియోకి బన్నీ కూడా బుట్ట‌లో ప‌డ్డాడుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Video | సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు ఫేక్ వీడియోలు కూడా ట్రెండ్ అవుతాయి. ఇప్పుడు అలాంటి ఒక వీడియో అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే బి యునిక్ క్రూ గ్రూప్ అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20(America’s Got Talent Season 20) వేదికపై ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ప‌ర్‌ఫార్మెన్స్‌పై న్యాయ నిర్ణేత‌లు ప్ర‌శంస‌లు కురిపించారు. సీజన్​లోనే ఉత్తమ ప్రదర్శనగా వారు అభివ‌ర్ణించారు. అయితే ఈ ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించిన వీడియోకి పుష్ప సినిమా(Pushpa Movie)లోని డాకో డాకో మేక సాంగ్ ట్రాక్ సెట్ చేసి తెగ వైర‌ల్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా కూడా పుష్ప మూవీ మరో ఘనత అందుకుందని భావించారు. తెలుగు పాట అంత‌ర్జాతీయ వేదిక‌పై మోగ‌డం విశేషమనుకున్నారు.

Fake Video | ఫేక్ వీడియో..

పుష్ప టీమ్ కూడా అధికారికంగా వీడియోను షేర్ చేసి, “ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప గ్లోబల్ ఫినోమినా” అని కామెంట్ చేసింది. అదే విధంగా అల్లు అర్జున్(Allu Arjun) కూడా వీడియోను రీట్వీట్ చేసి, “Wow … Mind blowing” అంటూ కామెంట్ పెట్టారు. దీనితో వీడియో విపరీతంగా వైరల్ అయింది. కాని చివ‌రికి తెలిసింది ఏంటంటే.. అది అసలు పుష్ప ట్రాక్ కాదు. బీ యూనిక్​ క్రూ గ్రూప్​ నిజానికి Imagine Dragons – “Believer” అనే పాట‌కి ప్ర‌ద‌ర్శ‌న చేశారు. అయితే ఆ  వీడియోని ఎడిట్ చేసి పుష్ప పాట యాడ్​ చేసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్​గా మారింది. ఇప్పుడు అస‌లు విష‌యం బయటకు రావడంతో అందరు షాక్​ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఒరిజిన‌ల్ వీడియో(Original Video) నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్ల‌స్ అయింది. పుష్ప చిత్రంతో బ‌న్నీ నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకున్నాడు. పుష్ప‌,పుష్ప‌2 చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంతో పుష్ప‌3ని కూడా తెర‌కెక్కించే ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.