Homeక్రీడలుIPL 2025 | ఐపీఎల్ మ్యాచ్​ రద్దు.. స్టేడియం బయటకు ప్రేక్షకులు

IPL 2025 | ఐపీఎల్ మ్యాచ్​ రద్దు.. స్టేడియం బయటకు ప్రేక్షకులు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: IPL 2025 : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్థాన్ మిసైల్ దాడులకు పాల్పడింది. దాంతో ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ మధ్యలో ఫ్లడ్‌లైట్స్ ఆపేసి మరి ప్రేక్షకులు, ఆటగాళ్లను మైదానం బయటకు పంపించారు.

సాంకేతిక కారణాల వల్ల ఈ మ్యాచ్ రద్దయ్యిందని అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ తెలిపాయి. ఐపీఎల్ నిర్వాహకులు కూడా మ్యాచ్ రద్దయ్యిందని పేర్కొన్నారు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ నిలిపేసే సమయానికి పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నటరాజన్ ఏకైక వికెట్ తీసాడు.

ఈ మ్యాచ్ రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. దాంతో పంజాబ్ కింగ్స్‌ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.