Wasim Akram
Wasim Akram Statue | హైదరాబాద్‌లో పాక్ బౌల‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌.. ముఖ కవళికలు చూసి ఫ్యాన్స్ కూడా న‌వ్వుకుంటున్నారు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Wasim Akram Statue | పాకిస్తాన్ బౌల‌ర్(Pakistan bowler) వ‌సీం అక్రమ్ గురించి ఈ నాటి త‌రం వారికి ప్ర‌త్యేకంగా తెలియ‌క‌పోవ‌చ్చు గాని 90ల‌లో ఆయ‌న క్రేజే వేరు. వసీం అక్రమ్ దాదాపు 20 ఏళ్ల పాటు పాకిస్తాన్ తరఫున ఆడాడు. ఒక పేస్ బౌలర్‌ అంతకాలం క్రికెట్‌లో రాణించడమంటే చాలా గొప్ప విషయమనే చెప్పొచ్చు. 1984 నుంచి 2003 మధ్య అక్రమ్ 104 టెస్టు మ్యాచ్‌లతో పాటు 356 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. టెస్టులో 414 వికెట్లు, వన్డేల్లో 502 మొత్తం 916 వికెట్లు పడగొట్టాడు. అయితే పాకిస్థాన్(Pakistan) క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Wasim Akram) గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Wasim Akram Statue | దారుణ‌మైన ట్రోల్స్..

వ‌సీం అక్ర‌మ్ విగ్ర‌హాన్ని చూసి చాలా మంది న‌వ్వుకుంటున్నారు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన 1999 వన్డే వరల్డ్ కప్ జెర్సీలో ఉన్నట్లు వసీమ్ అక్రమ్ విగ్రహాన్ని తయారు చేయించారు. అక్రమ్ యాక్షన్‌తో కూడిన విగ్రహాన్ని తయారు చేయించి నియాజ్ స్టేడియం(Niaz Stadium) బయట ఆవిష్కరించారు. అయితే బాడీ, యాక్షన్ అంతా బాగానే ఉంది కానీ ముఖం దగ్గరకు వచ్చేటప్పటికీ ఎవ‌రో విగ్ర‌హం మాదిరిగా ఉంది.. 1999లో వసీం అక్రమ్ ఫేస్ కాకుండా.. 2025లో వసీం అక్రమ్ ముఖంతో తయారు చేసినట్టు కనిపిస్తుంది. సరిగ్గా గమనిస్తే ఇప్పటికంటే ఇంకా ముసలితనంగా ఆ విగ్రహంలోని ఫేస్ ఉంది.

పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నగరంలో ఉన్న నియాజ్ స్టేడియంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, ఆ విగ్రహం అసలు వసీం అక్రమ్‌(Wasim Akram)లా లేదంటూ, చూడటానికి వికారంగా ఉందంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో నియాజ్ స్టేడియంలో వసీం అక్రమ్(Wasim Akram) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్ర‌హంలో ఏకాగ్రతతో బౌలింగ్ వేసే సమయంలో ఉండే హావభావాలకు బదులుగా, ముఖం చిట్లించినట్లుగా ఉందని, జుట్టు కూడా ఆయనను పెద్ద వయసు వ్యక్తిలా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. 10 శాతం సిమెంట్, 90 శాతం డిజప్పాయింట్‌మెంట్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్టున్నారని ఒక‌రు ‘ఎక్స్‌’లో ట్వీట్ చేశారు. సరిగ్గా ఇలాంటి కామెంట్స్, ట్రోలింగ్సే ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సచిన్ టెండూల్కర్ విగ్రహం ఆవిష్కరించినప్పుడు కూడా వచ్చాయి.