అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Premiere Show | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ బుధవారం రాత్రి పలుచోట్ల ప్రీమియర్ షోస్ జరుపుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు(Bangalore)లోని కే.ఆర్.పురం ప్రాంతంలోని ఒక థియేటర్లో కూడా ఓజీ ప్రీమియర్ షో ప్రదర్శించారు.
అయితే సినిమా ప్రారంభం అనంతరం అభిమానుల ఉత్సాహం అదుపు తప్పడంతో, కొందరు ప్రేక్షకులు తెర ముందుకు వచ్చి కత్తులతో స్క్రీన్‌ను చింపివేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్క్రీన్‌పై పెద్ద పగుళ్లు రావడంతో, థియేటర్ యాజమాన్యం(Theater Management) వెంటనే ప్రదర్శనను రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసారు. షో రద్దు కారణంగా భారీ ఎత్తున హాజరైన అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
ప్రముఖ హీరోల చిత్రాలకు అభిమానుల ఉత్సాహం సహజమే అయినప్పటికీ, ఆస్తి నష్టం కలిగించడం, ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడం అన్యాయం అని సినీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా, ప్రేక్షకుల అనుభవానికి కూడా తీవ్ర ప్రభావం పడుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ అనూహ్య ఘటనపై అధికారాలు కూడా సీరియస్‌గా దర్యాప్తు చేపట్టాయి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం ‘ఓజీ’ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం, భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యునైటెడ్ స్టేట్స్ మార్కెట్లో కూడా అద్భుతమైన ప్రీమియర్ షోలతో సంచలనం సృష్టించింది.
యూఎస్‌లో ఈ చిత్రం ప్రీమియర్ షోలతోనే 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ రికార్డును క్రియేట్ చేసి టాలీవుడ్లోకి ఒక కొత్త రికార్డు సెట్ చేసింది. ఈ ఘన విజయం వలన ‘ఓజీ’ సినిమా(OG Movie) ప్రీమియర్స్‌కి భారీ జనం హాజరై సినిమా పట్ల అభిమానాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రికార్డ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ అద్భుతమైన బాణీలు అందించారు. సుజీత్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కగా, ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్వహించింది. ఇప్పుడు అంతటా ఓజీ మానియానే నడుస్తుంది.