bengaluru stampede
bengaluru stampede | పుష్ప‌2 తొక్కిస‌లాట స‌మ‌యంలో బ‌న్నీ అరెస్ట్.. ఇప్పుడు అదే త‌ర‌హాలో ఆర్సీబీపై చర్య‌లు ఉంటాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: bengaluru stampede | కొన్ని నెల‌ల క్రితం పుష్ప‌2 Pushpa2 సినిమా (movie Pushpa 2)స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఒక మ‌హిళ మృతి చెందింది. అల్లు అర్జున్ భాద్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే జ‌రిగిందని , ఆయ‌న‌ని అరెస్ట్ చేశారు. మ‌రి ఇప్పుడు ఆర్సీబీ ఆట‌గాళ్ల(RCB players) బాధ్య‌తారాహిత్యం వ‌ల‌న ప‌దికిపైగా చ‌నిపోయారు. అదే తరహా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.పీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ బుధవారం బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్(victory parade) నిర్వహించింది. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియాని(Chinnaswamy Stadium)కి లక్షలాదిగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది.

bengaluru stampede | ఎంత దారుణం..

ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 55 మంది గాయపడ్డారు. బుధవారం బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ నిర్వహించారు. సంబరాల్లో భాగమయ్యేందుకు అభిమానులు లక్షల్లో తరలివ‌చ్చారు. విధాన సౌధ (Vidhana Soudha)లో ఆర్‌సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah)తో పాటు గవర్నర్ Governor సత్కరించారు. అయితే సంబురాల‌లో పాల్గొనేందుకు పాసులు ఉన్న‌వారినే అనుమ‌తించారు.

పాసులు లేని కొంతమంది అభిమానులు.. స్టేడియం గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అభిమానులు మరణించడం, గాయపడటం అందర్నీ కలిచి వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి

ఈ ఘ‌ట‌న‌పై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ఇంత మంది అభిమానులు వస్తారని ఊహించలేదని, తనకు 15 రోజుల సమయం ఇవ్వాలని, పూర్తి విచారణ జరిపిస్తానని తెలిపారు. స్టేడియం కెపాసిటీ 35వేలు అయితే 2-3 లక్షల మంది వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ DK Shivakumar, ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఓనర్లు,ఆటగాళ్లు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు