అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit Sharma | టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నాడో తెలియజేసే ఓ ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్ (New Zealand)తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సాధనలో నిమగ్నమై ఉన్న రోహిత్‌ను చూసిన ఓ అభిమాని, ఆయనకు ఎంతో ఇష్టమైన వడపావ్ తినమని మరాఠీలో ఆఫర్ చేయడం సోషల్ మీడియా (Social Media)లో చర్చనీయాంశంగా మారింది. “రోహిత్ భయ్యా, వడపావ్ పాహిజే కా?” (రోహిత్ భాయ్, వడపావ్ కావాలా?) అని అడగగా, హిట్‌మ్యాన్ చిరునవ్వుతో చేతిని ఊపుతూ మర్యాదపూర్వకంగా వద్దని సంకేతం ఇచ్చాడు. ఈ చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో వడపావ్‌పై తనకున్న ప్రేమను సరదాగా చెప్పుకున్న రోహిత్, ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం ఆ అలవాట్లకే దూరంగా ఉంటున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Rohit Sharma | రోహిత్ ఇన్ ఫామ్..
టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన ఆయన, శారీరక దృఢత్వం కోసం కఠినమైన ఫిట్‌నెస్ ప్రణాళికను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంతో పోలిస్తే హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్, ఆదివారం నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫోటోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
గత సంవత్సరం రోహిత్ శర్మ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకంగా నిలిచింది. ఆయన సారథ్యంలో టీమిండియా (Team India) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదే ఏడాది తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా అందుకున్నాడు. రికార్డుల విషయానికి వస్తే, వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో 355 సిక్సర్లతో హిట్‌మ్యాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
After the practice session ended, when Rohit Sharma came out, the fans jokingly said, “Rohit bhaiya, vadapav pahije ka” and
Rohit just waved his hand and replied, “No” 😂❤️bRO always enjoy with his fans❤️ pic.twitter.com/euco1nvMqs
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 6, 2026