అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పట్ల ఓ అభిమాని అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియా (Social Media)లో చర్చనీయాంశంగా మారింది. తనకు సెల్ఫీ ఇవ్వలేదన్న కారణంతో ఓ అభిమాని హార్దిక్‌ను దూషిస్తూ, “నాశనమైపోతావ్” అంటూ శాపనార్థాలు పెట్టాడు.
అయితే ఆ అభిమాని మాటలను పూర్తిగా పట్టించుకోకుండా హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హార్దిక్ ప్రవర్తనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చిన్న విషయాలకే సహనం కోల్పోయే వ్యక్తిగా పేరున్న హార్దిక్, ఈ ఘటనలో మాత్రం పూర్తి సంయమనం పాటించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
Hardik Pandya | అసలు ఏం జరిగింది అంటే..
మైదానంలో సహచర ఆటగాళ్లు తప్పిదాలు చేస్తే తీవ్రంగా స్పందించే హార్దిక్, ఇక్కడ మాత్రం వ్యక్తిగత దూషణను కూడా లైట్‌గా తీసుకోవడం చర్చకు దారి తీసింది. ముంబైలోని ఓ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో (Christmas Celebrations) పాల్గొనేందుకు హార్దిక్ పాండ్యా తన సన్నిహితురాలు మహికా శర్మతో కలిసి హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వస్తుండగా, సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు. హార్దిక్ మహికా శర్మ (Mahika Sharma)ను ముందుగా కారులో కూర్చోబెట్టి, అనంతరం కొందరు అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చాడు. ఓ అభిమాని అయితే అతని భుజాలపై చేయి వేసి మరీ ఫోటో దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.అయితే అభిమానుల గుంపు పెరిగిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని నియంత్రిస్తూ హార్దిక్‌ను కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తనకు సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో ఓ అభిమాని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ దూషణలకు దిగాడు. అయినా హార్దిక్ పాండ్యా ఆ మాటలకు స్పందించకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇటీవల భారత క్రికెటర్లతో అభిమానులు హద్దులు దాటుతున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకుండా సెల్ఫీలు, వీడియోల పేరుతో ఇబ్బంది పెట్టడం వల్ల పలువురు ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విమానాశ్రయంలో జస్ప్రీత్ బుమ్రా వద్దని చెబుతున్నా వినకుండా ఓ అభిమాని సెల్ఫీ వీడియో తీస్తుండటంతో బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేసి అతని ఫోన్‌ను కింద పడేశాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయిన ఘటన వైరల్ అయింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
𝗚𝘂𝘆𝘀, 𝘁𝗵𝗶𝘀 𝗶𝘀 𝗴𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝗧𝗢𝗢 𝗠𝗨𝗖𝗛 🤬🙏
A fan tried to approach Hardik Pandya for a selfie but couldn’t get close.
𝗙𝗮𝗻: 𝗕𝗛𝗔𝗔𝗗 𝗠𝗘 𝗝𝗔𝗢 (Go to Hell) 😡
𝗛𝗮𝗿𝗱𝗶𝗸: Either didn’t hear it, or heard it and chose to ignore.
This incident happened… pic.twitter.com/B929w11Iwi
— Jara (@JARA_Memer) December 25, 2025