Homeబిజినెస్​Falcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

Falcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Falcon business jets : విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వైమానిక ఉత్పత్తులకు కేంద్రంగా మారిన ఇండియా మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ, ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్​తో కలిసి ఇండియాలో ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన వెలువడింది.

మహారాష్ట్రలోని నాగ్​పూర్​ లో జెట్ల కోసం తుది అసెంబ్లీ లైన్​ను ఏర్పాటు చేయనున్నాయి. డసాల్ట్ ఫ్రాన్స్ వెలుపల ఫాల్కన్ 2000 జెట్లను తయారు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Falcon business jets : 2028 నాటికి ఉత్పత్తి..

ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ 2028 నాటికి కార్పొరేట్, సైనిక ఉపయోగాల కోసం ఇండియాలో తయారు చేసిన మొదటి జెట్లను డెలివరీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఫాల్కన్ 2000LXS బిజినెస్ జెట్లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడానికి ఫ్రెంచ్(France) విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్(Dassault Aviation), రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(Reliance Aerostructures Ltd) నాగ్​పూర్(Nagpur)​లో లగ్జరీ విమానాలను తయారు చేయడానికి తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. డసాల్ట్ తో రిలయన్స్ జట్టు కట్టిందన్న వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 5% పెరిగాయి.

ఫాల్కన్ 2000LXS జెట్ 8 నుంచి 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. నాగ్​పూర్​లోని డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (DRAL) నుంచి 2028 నాటికి మొదటి మేడిన్ ఇండియా జెట్ విమానం ఉత్పత్తి అవుతుందని ఫ్రెంచ్ విమాన తయారీ సంస్థ తెలిపింది. DRAL అనేది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్​తో డస్సాల్ట్ జాయింట్ వెంచర్. అంతే అనుకూలిస్తే సంవత్సరానికి 24 జెట్లను ఉత్పత్తి చేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.

“డస్సాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్ వెలుపల ఫాల్కన్ 2000 జెట్లను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇది భారతదేశాన్ని వ్యూహాత్మక ప్రపంచ విమానయాన కేంద్రంగా ఉంచుతుంది” అని డస్సాల్ట్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ United States, ఫ్రాన్స్ France, కెనడా Canada, బ్రెజిల్ Brazil​తో సహా తదుపరి తరం వ్యాపార జెట్లను తయారు చేసే దేశాల ఎలైట్ క్లబ్​ elite club లో ఇండియా Indiaచేరిందని పేర్కొంది.

Must Read
Related News