అక్షరటుడే, వెబ్డెస్క్ : Falaknuma Express | నల్గొండ (Nalgonda) జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ (Miryalaguda Railway Station)లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎంతకు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంజిన్లో లోపం తలెత్తడంతో రైలు ఆగిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. సుమారు గంట సేపటి నుంచి రైలు అక్కడే నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు మరో ఇంజిన్ తెప్పించేందుకు చర్యలు చేపట్టారు.