ePaper
More
    HomeజాతీయంFake Visa | శంషాబాద్​లో నకిలీ వీసాల ముఠా అరెస్టు

    Fake Visa | శంషాబాద్​లో నకిలీ వీసాల ముఠా అరెస్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fake Visa | నకిలీ వీసా(Fake Visa)లతో విదేశాలకు పంపుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఇద్దరు ముఠా సభ్యులను శంషాబాద్​ పోలీసులు(Shamshabad Police) అరెస్టు చేశారు. శంషాబాద్​ ఏసీపీ శ్రీకాంత్​ గౌడ్​(ACP Srikanth Goud) తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ పాస్‌పోర్ట్, వీసాలతో 8 మంది శంషాబాద్ ఎయిర్​పోర్టు నుంచి విదేశాలకు వెళ్తున్నారన్న సమాచారం రావడంతో లాండ్ ఆర్డర్, ఎస్వోటీ పోలీసులు(SOT Police) దాడులు చేశారు. అనంతరం ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, బాలరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్, హైదరాబాద్​కు చెందిన అంజి ముఠాగా ఏర్పడి నకిలీ వీసాలు తయారు చేస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్​ చేసి వారి వద్ద రూ. లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పంపుతున్నారని తెలిపారు.

    ఇదే విధంగా శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి బుధవారం 8 మందిని మస్కట్ పంపిస్తుండగా దాడులు చేసి.. నకిలీ వీసా ముఠాలోని బాలరాజు, శివకుమార్​ను అరెస్టు చేశారు. కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ముఠా వద్ద నుంచి 14 పాస్‌పోర్టులు, 14 వీసాలు, 16 విమాన టికెట్లు, 7 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...