అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు.