అక్షరటుడే, వెబ్డెస్క్: Fake Notes | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో దొంగ Thief కరెన్సీ నోట్ల చలామణి తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఫేక్ కరెన్సీ నోట్ల పంపిణీ వెలుగుచూసింది. స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జోరుగా ఈ నోట్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని దొంగనోట్లు పంపిణీ చేసినట్లు సమాచారం.
Fake Notes | వెలుగుచూసిందిలా..
స్థానిక కెనరా బ్యాంక్ బ్రాంచ్లో పంట రుణం కట్టడానికి వెళ్లిన ఓ రైతు వద్ద ఫేక్ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చా యి.
కాగా.. ఈ నకిలీ కరెన్సీని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ నోట్లను గ్రామంలోని చాలా మందికి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఓటు వేసేందుకు సదరు సర్పంచ్ అభ్యర్థి వద్ద నకిలీ నోట్లు తీసుకున్న ఓటర్లలో గుబులు మొదలైంది. దొంగ నోట్లు తీసుకుని మోసపోయామని ఓ వైపు లబోదిబోమంటున్న ప్రజలు.. ఇప్పుడు ఈ ఫేక్ కరెన్సీ నోట్ల కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిపోతున్నారు.
Fake Notes | పలు అనుమానాలు..
దొంగ నోట్ల వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం ఒక్క రైతు వద్ద పలు ఫేక్ కరెన్సీ నోట్లు లభించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కన ఆ గ్రామంలో ఎంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారనేది అంతుచిక్కడం లేదు. ఈ నోట్లు ఆ ఊరు దాటి బయట మార్కెట్లోకి వస్తే పరిస్థితి ఏమిటనేది అధికారులు, స్థానికుల్లోనూ గుబులు పుట్టిస్తోంది.
ఈ ఫేక్ నోట్లు ఆ ఒక్క గ్రామంలో పంపిణీ చేశారా.. నిజామాబాద్ జిల్లాలోని ఇతర గ్రామాల్లోనూ ఇలా జరిగిందా.. అనేది అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.