అక్షరటుడే, హైదరాబాద్: Fake junior lecturers | ఫేక్ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన వారిపై వేటు పడబోతోంది. వారిని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ కేసులో Feb 11, 2005 న ప్రొఫెసర్ యష్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసులో సుప్రీం కోర్టు Supreme Court ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటున్నారు.
దీని ప్రకారం.. 2005 తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు చెందని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి దూరవిద్య, రెగ్యులర్ కేటగిరీల్లో పట్టాలు పొందినవారిని తొలగించే అవకాశం ఉంది.
Fake junior lecturers | టీచింగ్, నాన్ టీచింగ్..
రాష్ట్రంలో ఇలాంటివారు సుమారు 375 మంది జూనియర్ అధ్యాపకులు (రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ 10% కోటాలో నియమితులైన అధ్యాపకులతో సహా) ఉన్నారు.
వీరందరినీ ఇంటర్ విద్యా శాఖ ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ఈ మేరకు Intermediate Board కమిషనర్ డా. పీ మధుసూదన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
Fake junior lecturers | బయట పడింది ఇలా..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్ 2, 2014 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల lecturers ను మే, 2023 లో అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
అలా మొత్తం 3,125 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్ అయ్యారు. వీరిలో 189 మంది ఒకేషనల్ లెక్చరర్లు ఉన్నారు.
కాగా, ఇందులో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
దీంతో అప్పట్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి కొందరిని తొలగించారు. ప్రస్తుతం వారి ప్రొబేషన్ పీరియడ్ పూర్తికావడంతో ఇంటర్మీడియెట్ బోర్డు మరోసారి వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది.
ఈ క్రమంలో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగులు పొందినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ మేరకు వారిని తొలగించాలని ఇంటర్ బోర్డు కమిషనర్ అడుగులు వేస్తున్నారు.