అక్షరటుడే, హైదరాబాద్: Fake junior lecturers | ఫేక్ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన వారిపై వేటు పడబోతోంది. వారిని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ కేసులో Feb 11, 2005 న ప్రొఫెసర్ యష్పాల్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ (Professor Yashpal vs. State of Chhattisgarh) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటున్నారు.
దీని ప్రకారం.. 2005 తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు చెందని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి దూరవిద్య, రెగ్యులర్ కేటగిరీల్లో పట్టాలు పొందినవారిని తొలగించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇలాంటివారు సుమారు 375 మంది జూనియర్ అధ్యాపకులు (రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ 10% కోటాలో నియమితులైన అధ్యాపకులతో సహా) ఉన్నారు.
వీరందరినీ ఇంటర్ విద్యా శాఖ ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ డా. పీ మధుసూదన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్ 2, 2014 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ను మే, 2023 లో అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
అలా మొత్తం 3,125 మంది కాంట్రాక్టు లెక్చరర్లు contract lecturers రెగ్యులర్ అయ్యారు. వీరిలో 189 మంది ఒకేషనల్ లెక్చరర్లు ఉన్నారు.
Fake junior lecturers | ఖజానా శాఖ వల్లే వెలుగుచూసిందా..?
సాధారణంగా ఉద్యోగంలో చేరినప్పుడు మొదటి ఇంక్రిమెంట్ ఇస్తారు. కానీ, రెండో ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి కావాల్సి ఉంటుంది.
ఇటీవల రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రెండో ఇంక్రిమెంటును సాలరీతో కలుపుకొని బిల్లులను ట్రెజరీలో సమర్పించారు.
కానీ, ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తికాకుండా రెండో ఇంక్రిమెంట్ మంజూరు చేయమని ట్రెజరీ అధికారులు తేల్చి చెప్పడంతోపాటు బిల్లులను రిజెక్టు చేశారు.
ఈ విషయంలో పలు ఉద్యోగు సంఘాల నేతలు ఖజానా శాఖ అధికారులపై రాజకీయంగా, అధికారికంగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
“రెండో ఇంక్రిమెంట్ విషయంలో తమ ఇంటర్ బోర్డు అధికారులే అనుమతి ఇవ్వగా.. మీరేంటి అభ్యంతరం తెలుపుతున్నారంటూ గగ్గోలు పెట్టారు..” అయినా ట్రెజరీ శాఖ అధికారులు వెనక్కి తగ్గలేదు.
నిబంధనల ప్రకారం ప్రొబేషన్ డిక్లరేషన్ అయితేనే రెండో ఇంక్రిమెంటు మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు వారు బిల్లులు తీసుకొచ్చినా రిజెక్టు చేశారు.
ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం అడుగులు వేసింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటే ఆంట్సిడెంట్స్ (పున: పరిశీలన) సర్టిఫెకెట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ఇందుకోసం పోలీసులతో క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. డిపార్టుమెంటు అధికారులు కూడా సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాల్సి ఉంటుంది.
ట్రెజరీ అధికారులు రెండో ఇంక్రిమెంటును నిలిపివేయడంతో ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే నకిలీ లెక్చరర్ల బాగోతం వెలుగుచూసింది.
ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గి రెండో ఇంక్రిమెంట్ మంజూరు చేసి ఉంటే.. నకిలీలు ఇప్పట్లో వెలుగుచూసేవారు కాదని స్పష్టం అవుతోంది.