HomeUncategorizedITC Scam | నకిలీ ఐటీసీ స్కాం.. హైదరాబాద్​లో ఈడీ సోదాలు

ITC Scam | నకిలీ ఐటీసీ స్కాం.. హైదరాబాద్​లో ఈడీ సోదాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ITC Scam | నకిలీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ITC) కుంభకోణంలో ఈడీ అధికారులు (ED Officials) విచారణ వేగవంతం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపడుతున్నారు.

నకిలీ ఐటీసీ స్కాంలో గురువారం ఈడీ అధికారులు సోదాలు (ED Raids) చేపట్టారు. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల్లో తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం కూడా హైదరాబాద్‌ (Hyderabad), మేడ్చల్ (Medchal) జిల్లాలో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. రూ.కోట్ల వ్యాపారం చేసినట్లు ఫేక్​ ఇన్​వాయిసులు సృష్టించి షెల్​ కంపెనీల (Shell Companies) ద్వారా రూ.650 కోట్లు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే శివకుమార్​ అనే వ్యక్తిని అధికారులు మేలో అరెస్ట్ చేశారు. ఆయనే ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది.

ITC Scam | ఐదు రాష్ట్రాల్లో..

ఈడీ అధికారులు గురువారం హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణలో తనిఖీలు చేపట్టారు. ఈ కుంభకోణంలో హవాలా వ్యాపారులు, షెల్​ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో లబ్ధి పొందారు. బీహార్​కు చెందిన ఇద్దరు చార్టెడ్​ అకౌంటెంట్లు ఈ స్కామ్​లో కీలకంగా వ్యవహరించారు. గతంలో లవర్​ కోసం పాకిస్తాన్ నుంచి భారత్​కు వచ్చిన సీమా హైదర్​, ఆమె భర్త సచిన్ పేర్లతో సైతం నిందితులు డబ్బులు దోచుకున్నారు. సీమా, సచిన్​ ఫొటోలు వాడి నిందితులు అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) ప్రభుత్వం నుంచి రూ.99.21 కోట్లను కాజేసినట్లు ఈడీ గుర్తించింది.

కాగా ఈ కేసులో ఈడీ అధికారులు ఆగస్టులో జార్ఖండ్​, పశ్చిమబెంగాల్​, మహారాష్ట్రలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 135 షెల్​ కంపెనీల ద్వారా నిందితులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.