అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake doctor | నకిలీ వైద్యుడు ఓ యువకుడి ప్రాణాలు హరించాడు. ఈ ఫేక్ డాక్టర్ బాధిత యువకుడి ప్రైవేటు పార్టులలో ఇంజెక్షన్ injection ఇవ్వడంతో అతడి ఆరోగ్యం క్షీణించి, ప్రాణాలే పోయాయి.
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బలోద్ జిల్లా (Balod district) లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో నకిలీ వైద్యుడి బాగోతం వెలుగుచూసింది.
బలోద్‌లో సుభాష్ జనబంధు అనే యువకుడు కొంత కాలంగా పైల్స్ తో బాధపడుతున్నాడు. దీంతో వైద్యం కోసం గత మే నెల 8వ తేదీన అర్జుండాలోని ఒక క్లినిక్‌లో సంప్రదించారు.
ఆ క్లీనిక్‌లో నకిలీ వైద్యుడు రేఖా రామ్ సాహు బాధిత యువకుడికి చికిత్స అందించాడు. సుభాష్ ప్రైవేట్ భాగాల్లో ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తొమ్మిది ఇంజెక్షన్లు ఇచ్చాడు.
ఇందుకు గాను రూ.8 వేలు కూడా వసూలు చేశాడు. కాగా, చికిత్స అందుకున్న మరుసటి సుభాష్ ఆరోగ్యం దెబ్బతింది. ఇంజెక్షన్ వేసిన ప్రదేశంలో విపరీతంగా రక్తస్రావమైంది. కడుపు కూడా ఉబ్బిపోయింది.
Fake doctor | విషమించిన ఆరోగ్యం
యువకుడి ఆరోగ్యం విషమించిన విషయం తెలిసి, నకిలీ వైద్యుడు తన ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇటు సుభాష్ మరింత బాధకు లోనుకావడంతో అతడి కుటుంబ సభ్యులు భిలాయ్‌లోని శంకరాచార్య హాస్పటిల్ (Shankaracharya Hospital) లో చేర్పించారు.
Fake doctor | ఆస్పత్రిలో మరణించిన సుభాష్
ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుభాష్ మరణించాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు రేఖా రామ్ సాహును అరెస్టు చేశారు.
నకిలీ వైద్యుడిపై నకిలీ పత్రాలతో ప్రాక్టీస్ చేసినందుకు, ఛత్తీస్‌గఢ్ మెడికల్ కౌన్సిల్ చట్టం, 1987లోని సెక్షన్ 24 కింద చికిత్సలో నిర్లక్ష్యం తదితర నేరాల కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.