Fake Certificate | కూకట్‌పల్లిలో ఫేక్​ సర్టిఫికెట్స్ దుకాణం.. డబ్బులిస్తే ఏ కోర్సుదైనా విక్రయం..!
Fake Certificate | కూకట్‌పల్లిలో ఫేక్​ సర్టిఫికెట్స్ దుకాణం.. డబ్బులిస్తే ఏ కోర్సుదైనా విక్రయం..!

అక్షరటుడే, హైదరాబాద్: Fake Certificate : ఓ వైపు ఇంజినీరింగ్ విద్య కోర్సుల పేరుతో ఫీజుల రూపంలో తల్లిద్రండులను​ కళాశాలలు లూఠీ చేస్తున్నాయి. మరోవైపు వారి టార్గెట్​ కోసం విద్యార్థులను ఆయా సబ్జెక్టులలో ఫెయిల్​ చేయడం ద్వారా బ్యాక్​లాగ్​లు ఉంచుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఇవన్నీ భరించి బయటకు వచ్చి ఉద్యోగం అందుకుందామంటే.. ఫేక్​ సర్టిఫికెట్స్ తో కొందరు అడ్డదారుల్లో వీరి కొలువులను కాజేసి, విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారు.

ఇలా ఫేక్​ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో కొందరు అక్రమార్కులు భారీ మోసానికి తెర లేపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఏకంగా సర్టిఫికెట్స్ దుకాణమే పెట్టేశారు. డబ్బులు ఇస్తే.. ఏ కోర్సు సర్టిఫికెట్​ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి ఇచ్చేస్తారు. అమీర్​పేట్ Ameerpet​, దిల్​సుఖ్​నగర్​ Dilsukhnagar, కేపీహెచ్​బీ KPHB.. ఏరియా ఏదైనా ఎక్కడో ఒక మూలన కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి అక్రమ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Fake Certificate : ముఠా గుట్టు రట్టు..

కూకట్​పల్లి (Kukatpally)లో నకిలీ సర్టిఫికెట్స్ రూపొందించే ముఠా గుట్టును తాజాగా సైబరాబాద్​ పోలీసులు రట్టు చేశారు. కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు, విదేశాల్లో కొలువు, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకున్న కొందరు కూకట్​పల్లిలో ఏకంగా ఫేక్​ సర్టిఫికెట్స్ దుకాణం తెరిచారు. ఈ దుకాణానికి శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరు పెట్టారు. అభ్యర్థల అవసరాలను లక్ష్యంగా చేసుకుని, అక్రమార్జనకు తెరలేపారు.

వీరి అక్రమాలు తారాస్థాయికి చేరి, బయటకు పొక్కడంతో చివరికి పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారంతో సైబరాబాద్​ పోలీసులు సదరు కన్సల్టెన్సీలో సోదాలు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Fake Certificate : ఏ సర్టిఫికెట్​ అయినా సిద్ధం..

పోలీసుల కథనం ప్రకారం.. ఫేక్​ సర్టిఫికెట్ నిందితులను A.హరీష్, M.మహేష్​గా గుర్తించారు. వీరు కుకట్‌పల్లిలో శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఫారెట్​ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల పట్టాలు ప్రింట్​ చేసి ఇస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే.. అచ్చం ఒరిజినల్​ మాదిరే ఉంటాయి. వీరు రూపొందించిన సర్టిఫికెట్స్ ను ఒరిజినల్​ వాటి పక్కన పెట్టి పోల్చితే గుర్తుపట్టడం కష్టం. అంత పక్కాగా సర్టిఫికెట్స్ రూపొందించడం వీరి నైపుణ్యమనే చెప్పాలి.

Fake Certificate : విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం..

వీరి దుకాణంలో పోలీసులు సోదాలు చేపట్టగా.. కుప్పలు తెప్పలుగా నకిలీ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో వాటితోపాటు, సెల్​ ఫోన్లు, కీలకమైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ఇప్పటివరకు 46 మందికి ఫేక్​ సర్టిఫికెట్స్ జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో 24 మంది ఇప్పటికే ఫారెన్​ వెళ్లిపోయినట్లు తేలింది.

సదరు నిందితులకు విజయవాడ Vijayawada కు చెందిన మోహన్ ఈ నకిలీ సర్టిఫికెట్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం మోహన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.