HomeతెలంగాణFake Certificates | జీహెచ్​ఎంసీలో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్​.. చర్యలు షురూ..!

Fake Certificates | జీహెచ్​ఎంసీలో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్​.. చర్యలు షురూ..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Fake Certificates | గ్రేటర్​ హైదరాబాద్ (Greater Hyderabad)​ సిటీలో భారీగా నకిలీ బర్త్​, డెత్​ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అధికారులు డబ్బులు తీసుకొని ఎవరికి పడితే వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు.

ఇప్పటికే హైదరాబాద్​లో పాక్​(Pakistan), బంగ్లాదేశ్(Bangladesh) నుంచి వచ్చి పలువురు అక్రమంగా నివసిస్తున్నారు. అంతేగాకుండా వారు ఇక్కడ ఆధార్​, ఓటర్ కార్డులు తీసుకోవడం గమనార్హం. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తుండటంతో అక్రమ వలసదారులు సైతం దర్జాగా ఆధార్​ కార్డు (Aadhar Card) తీసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

నార్సింగి పోలీస్​ స్టేషన్ (Narsingi Police Station)​ పరిధిలో ఇటీవల ఫేక్​ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. కొందరు మీ సేవ నిర్వాహకులు అధికారులతో కలిసి ఈ దందాకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇలాంటి వారు నగర వ్యాప్తంగా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.

Fake Certificates | 22,906 ఫేక్​ సర్టిఫికెట్లు రద్దు చేసిన జీహెచ్​ఎంసీ

నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) వ్యవహారంపై విచారణ చేపట్టిన జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. 22,906 ఫేక్ సర్టిఫికెట్లను రద్దు చేశారు. వీటిలో బర్త్ సర్టిఫికెట్లు (Birth certificates) 21,000, డెత్ సర్టిఫికెట్లు (Death certificates) 1,906 ఉన్నాయి. మెహిదీపట్నంలో అత్యధికంగా 5,403 ఫేక్​ బర్త్ సర్టిఫికెట్లు ఉండగా, చార్మినార్ సర్కిల్​లో 3,256, బేగంపేట్​లో 2,123, సికింద్రాబాద్ పరిధిలో 1,511, ఫలక్ నుమా సర్కిల్ పరిధిలో 1,383 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి.

Fake Certificates | అధికారులపై వేటు

నకిలీ బర్త్​, డెత్​ సర్టిఫికెట్ల జారీకి సహకరించిన అధికారులపైనా జీహెచ్ఎంసీ (GHMC) చర్యలు చేపట్టింది. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి కారణమైన హెల్త్ అసిస్టెంట్లు, కంపూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్లపై వేటు వేసింది. 16 మంది హెల్త్​ అసిస్టెంట్లు, 15 మంది కంప్యూటర్​ ఆపరేటర్లను విధుల్లో నుంచి తొలగించింది. ఇద్దరు మెడికల్​ ఆఫీసర్లను పేరెంట్​ డిపార్ట్​మెంట్​కు పంపించారు.